RAINS: ఏపీలో భారీ వర్షం... నేడు స్కూళ్లకు సెలవు

RAINS: ఏపీలో భారీ వర్షం... నేడు స్కూళ్లకు సెలవు
X
విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. ఇప్పటికే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు సెలవు ప్రకటించగా... తాజాగా గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, కాకినాడ, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కాకినాడలో నేడు నిర్వహించాల్సిన పరీక్షను సోమవారం నిర్వహించనున్నారు. భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం గుజరాత్ పక్కన తుపాను ఏర్పడింది. దానికి ఏస్నా అనే పేరు పెట్టారు. బంగాళాఖాతంలో అల్పపీడనం.. బలంగా ఉంటూ.. వాయుగుండంగా మారుతోంది. ఇది పూర్తిగా వాయుగుండం అవ్వడానికి మరో 24 గంటలు పడుతుంది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల తెలుగు రాష్ట్రాల్లో వారం పాటూ వానలు కురుస్తాయి. ఇవాళ కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకూ అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో సెప్టెంబర్ 3 వరకూ అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తాయి.

కోస్తాంధ్ర, మధ్య తెలంగాణ, ఉత్తరాంధ్ర, హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి మొత్తం తెలంగాణ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీలో దక్షిణ రాయలసీమ తప్ప మిగతా అంతటా మోస్తరు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితి రోజంతా ఉంటుంది. అర్థరాత్రి తర్వాత కూడా ఉంటుంది. సెప్టెంబర్ 1న తెల్లవారుజాము తర్వాత ఏపీలో కొంత వాన తగ్గుతుంది.

Tags

Next Story