23 April 2021 8:00 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / విశాఖ ప్రభుత్వ భూముల...

విశాఖ ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్..!

నగరంలోని 5 ప్రాంతాల్లో ఉన్న భూములు అమ్మడం ద్వారా 15 వందల కోట్లు సమీకరించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది.

విశాఖ ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్..!
X

విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు అమ్మాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. ఈ భూముల అమ్మకానికి సంబంధించిన టెండర్లు ఫైనలైజ్ చేయకుండా హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నగరంలోని 5 ప్రాంతాల్లో ఉన్న భూములు అమ్మడం ద్వారా 15 వందల కోట్లు సమీకరించుకోవాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. దీన్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇవాళ ఆ విచారణ సందర్భంగా టెండర్ల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లడానికి వీల్లేదంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Next Story