రామతీర్థంలో హైటెన్షన్.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అరెస్ట్

X
విజయనగరం జిల్లా రామతీర్థంలో హైటెన్షన్ నెలకొంది. విగ్రహం ధ్వంసం ఘటన... మలుపులు తిరుగుతుంది. పలువురు టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థంకి చెందిన ఇద్దరు మాజీ వార్డు మెంబర్లు సూరిబాబు, రాంబాబులను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో మరో నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాముల వారి విగ్రహం ధ్వంసంపై నేరం అంగీకరించాలని హింసిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. విగ్రహం ధ్వంసం ఘటనను టీడీపీపై నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
