కళ్యాణదుర్గంలో తీవ్ర ఉద్రిక్తత

కళ్యాణదుర్గంలో తీవ్ర ఉద్రిక్తత
టీ-సర్కిల్‌లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మహానాడు వేదికగా TDP మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో TDP శ్రేణులు.. పార్టీ అధినేత చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం తలపెట్టారు. భారీగా తరలివచ్చిన TDP నేతలు, కార్యకర్తలు.. టీ-సర్కిల్‌లో చేపట్టిన పాలాభిషేకం చేయకుండా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో TDP శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంపై TDP నేతలు ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కళ్యాణదుర్గం పోలీసులు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.

Tags

Next Story