Home Minister Anitha : అశోక గజపతి రాజును కలిసిన హోంమంత్రి అనిత..

X
By - Manikanta |19 July 2025 6:15 PM IST
గోవా గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిశారు హోమ్ మంత్రి అనిత. విజయనగరం లోని ఆయన నివాసం లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గోవా గవర్నర్‌గా అశోక గజపతి రాజు ను ప్రకటించడం సంతోకరమైన వార్త అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా విజయనగరం జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఎలాంటి ఆరోపణలు లేని వ్యక్తి అని... నీతికి, నిజాయితీకి అశోక గజపతి రాజు మారుపేరు అని కొనియాడారు. అలాంటి వ్యక్తి కి తగిన గౌరవం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు హోమ్ మంత్రి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com