AP : బూతుల రాజకీయం.. ఏపీలో ఎలా మొదలైందంటే..!

AP : బూతుల రాజకీయం.. ఏపీలో ఎలా మొదలైందంటే..!
X

తెలంగాణలో కొండాసురేఖ రేపిన మాటల చిచ్చుపై అంతటా చర్చ నడుస్తోంది. ఏపీలో ఈ కల్చర్ ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే సంస్కృతి తెలంగాణకు పాకడం దురదృష్టం అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉంది. తెలుగుదేశం, జనసేన నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు, మంత్రులు చేసిన విమర్శలు, వారు వాడిన భాషపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయా నేతలు ఆ విమర్శలను పట్టించుకోలేదు. మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, రోజా, జోగి రమేష్ వంటివారిపై ఏకంగా బూతు మంత్రులుగా ముద్రపడి పోయింది. అసెంబ్లీ సాక్షిగా విపక్షనేత చంద్రబాబుపై.. ఆయన సతీమణిని, కుమారుడు లోకేష్ పుట్టుకను ప్రశ్నిస్తూ అధికార పక్ష నేతలు చేసిన విమర్శలు అత్యంత జుగుప్సాకరంగా మారాయి.

అప్పుడే కాదు.. ఆ తరువాత, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అదే తీరులో వారు వ్యవహరించారు. వారిని కట్టడి చేయాల్సిన పెద్దలు.. ఆ దుర్భాషలు విని మురిసిపోయారు. ఇలాంటి పరిణామాలను భరించలేని ప్రజలు... సమయం చూసి వాత పెట్టారు. నోరుపారేసుకున్న ప్రతీ నాయకుడినీ ఓడించారు. వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో ఈ బూతుపురాణం కూడా ఒకటి. ఇది కాదన్నవారు లేరు. అటు తెలుగు దేశంలోనూ ఒకరిద్దరు అభ్యంతరకరమైన భాషను ప్రయోగించారు. అయితే అప్పటి అధికారపక్షం నేతల్లా విచ్చలవిడిగా రెచ్చిపోలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్లో నేతల భాష కాస్త దారికొచ్చింది.

Tags

Next Story