AP Employees: ఏపీ ఉద్యోగులకు మరో షాక్.. హెచ్‌ఆర్‌ఏలో భారీ కోత..

AP Employees: ఏపీ ఉద్యోగులకు మరో షాక్..  హెచ్‌ఆర్‌ఏలో భారీ కోత..
AP Employees: ఏపీలో ఉద్యోగులకు జగన్ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది.

AP Employees: ఏపీలో ఉద్యోగులకు జగన్ సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో భారీగా కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగుల HRAలో 30 శాతం నుంచి 16 శాతానికి కోత పెట్టింది. గుంటూరు, విశాఖ, నెల్లూరు, విజయవాడ, వెలగపూడి సచివాలయ ఉద్యోగులకు మూలవేతనంలో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రంలోని మిగతా అన్ని ప్రాంతాలకు 8 శాతం HRA ప్రకటించింది. అలాగే రిటైర్డ్‌ ఉద్యోగులకు 80 ఏళ్ల వయసు దాటాకే అదనపు పెన్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. హెచ్‌ఆర్‌ఏలో కోతలు పెట్టడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జగన్ సర్కారు ప్రకటనపై ఇటు ఉద్యోగ సంఘాల నేతలు, అటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ అన్ని జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన చేపట్టాలని ఉద్యోగులు నిర్ణయించారు.

గతంలో 70 ఏళ్లు దాటాక 15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తుచేశారు. పాత శ్లాబ్‌ను ఈ ప్రభుత్వం రద్దు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. 80 ఏళ్లు దాటిన తర్వాత 20 శాతం, 85 దాటిన తర్వాత 30 శాతం, 90 ఏళ్లు దాటాక 40 శాతం, 95 ఏళ్లు దాటాక 50 శాతం, 100 ఏళ్లు దాటిన తర్వాత 100 శాతం అదనపు పెన్షన్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వం విజయవాడ, విశాఖలో పనిచేసే ఉద్యోగులకు సీసీఏ ఇచ్చినా...అధికారంలోకి వచ్చాక జగన్‌సర్కార్ సీసీఏను రద్దు చేసింది.

ఇప్పటికే 23 శాతం పీఆర్సీని వ్యతిరేకించిన ఉద్యోగ సంఘాలు.. 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ, డీఏలు సహా అన్ని సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఇంతలో తాజాగా HRAలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల ఉద్యోగులు భగ్గమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story