AP : టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణాలు
ఏపీలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అంగీకరించింది. దీనిపై ప్రభుత్వ అధికారులు హడ్కో ప్రతినిధులతో చర్చించారు. ఎంత ఖర్చు అవుతుందనే దానిపై రెండు రోజుల్లో హడ్కోకు నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్‌లో ఉన్న 1.17లక్షల గృహాలను పూర్తిచేయడానికి ₹5,070 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3.14 లక్షల గృహాలను చేపట్టగా...వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 52 వేల గృహాలను రద్దు చేసింది. 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల నాటికి 1.45 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది. ఇందులో మెజారిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతంపైగా పూర్తి చేసినవే. ఇంకా 1.17 లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకుగాను రూ.5,070 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com