LOKESH: జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా.. పాదయాత్ర

LOKESH: జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా.. పాదయాత్ర
లోకేష్ ను చూసేందుకు రోడ్డుపైనే కాదు చెట్లు,బిల్డింగులు ఎత్తైన ప్రదేశాలు ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేచి చూస్తున్నారు.

నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా.. గతంలో ఎన్టీఆర్‌ సభలకు వచ్చిన జనాలను చూసి ఇలా అనేవారు. ఎన్టీఆర్ ఎక్కడిని వెళ్ళినా జనాలు తండోప తండాలుగా వచ్చేవారు.ఎన్టీఆర్ తరువాత కాలంలో చాలా మంది నాయకులు వచ్చి సభలు పెట్టినా కొన్ని మాత్రమే నేల ఆ స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి.ప్రస్తుతం యువనేత లోకేష్‌ యువగలం పాదయాత్రకు వస్తున్న జనంను చూసి ఎవరైనా సరే నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడిందా అని అంటున్నారు. లోకేష్ ను చూసేందుకు రోడ్డుపైనే కాదు చెట్లు,బిల్డింగులు ఎత్తైన ప్రదేశాలు ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేచి చూస్తున్నారు.

జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగుతున్న నారా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టీడీపీ యువనేత రాకతో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం జనసంద్రమైంది. నెల్లూరు రూరల్‌లో ఎటు చూసినా యువగళం హోరెత్తింది. లోకేష్‌కు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన లోకేష్ టీడీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేస్తామని అన్ని వర్గాల ప్రజలకు హామీ ఇచ్చారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చాక గుండ్లపాడు కృష్ణపట్నం ఓడరేవు రోడ్డును 4 లైన్లుగా మార్చుతామని టీడీపీ యువనేత లోకేష్‌ హామీ ఇచ్చారు.కాంట్రాక్టర్లకు జగన్ సర్కారు లక్ష కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.అందుకే టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పరారవుతున్నారని ఎద్దేవా చేశారు.జగన్‌ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీ లేని కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీలకు చెందాల్సిన 75 వేల కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు. ప్రశ్నించిన బీసీలపై దాడులు చేస్తూ గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్‌లోని ఆకుతోటలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story