TDP: బస్సుయాత్రకు..బ్రహ్మరథం

అనంతపురం జిల్లాలో టీడీపీ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్‌లో జననీరాజనం పలికారు.రాత్రి వేళలోనూ టీడీపీ బస్సుయాత్రకు జనసంద్రం పోటెత్తింది.మాజీమంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్‌రెడ్డి, టీడీపీ నేతలకు పూలవర్షం, బాణసంచాలతో ప్రజలు ఘనస్వాగతం పలికారు.
భవిష్యత్‌కు భరోసా రోడ్ షోలో వైసీపీ సర్కారుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇసుకాసురుడిగా మారారని కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఇసుకను బెంగళూరుకు తరలించి కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు.టీడీపీ మేనిఫెస్టోతో ప్రజల భవిష్యత్‌కు భరోసా అని పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు సీఎంగా వస్తేనే మళ్లీ రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com