PROTESI: చంద్రబాబు అరెస్ట్‌పై భగ్గుమన్న ఐటీ ఉద్యోగులు

PROTESI: చంద్రబాబు అరెస్ట్‌పై భగ్గుమన్న ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్‌లో సెలవు పెట్టీ మరీ ఆందోళనలు.... జగన్‌ కక్ష సాధింపులపై తీవ్ర ఆగ్రహం

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళనలతో కదం తొక్కారు. వుయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినదించారు. హాఫ్‌ డే సెలవు పెట్టి మరీ చంద్రబాబుకు మద్దతుగా తరలివచ్చారు. విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్ రింగ్‌రోడ్ వరకు ర్యాలీ చేసిన ఉద్యోగులు బాబుకు అండగా ఉంటాయమని నినాదాలు చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేశంలో విజన్‌ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబేనని కొనియాడారు.


చంద్రబాబు అరెస్ట్‌పై ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు అప్రజాస్వామిక అరెస్ట్పై సెటిలర్స్ భగ్గుమన్నారు.చంద్రబాబు అరెస్ట్పై ఐటీ ఉద్యోగులు, తెలంగాణ పౌరహక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు, టీడీపీ అభిమానులు నిరసనల్లో పాల్గొని ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.


హైదరాబాద్‌ విప్రో సర్కిల్‌ వద్ద ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. 'ఐయామ్‌ విత్‌ సీబీఎన్‌' ప్లకార్డులు ప్రదర్శించిన ఐటీ ఉద్యోగులు, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలి-సైకిల్‌ రావాలి, జై చంద్రబాబు అంటూ హోరెత్తించారు. ఏపీలో నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధీ జరగడం లేదని మండిపడ్డారు. తామంతా చంద్రబాబు వెంటే ఉన్నామని ఎలుగెత్తి చాటారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబును అరెస్టు చేశారని ఐటీ ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలకు అసలు విజన్ అంటే ఏమిటో తెలుసా అని ఐటీ ఉద్యోగులు ప్రశ్నించారు.


హాఫ్‌డే సెలవు పెట్టి మరీ చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబుపై వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అరెస్టు కక్షసాధింపు చర్యేనన్న ఐటీ ఉద్యోగులు... ఆయనకు అవినీతి మరకలు అంటించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story