Lokesh : ప్రధాని మోదీతో భేటీ నా అదృష్టం : లోకేశ్

Lokesh : ప్రధాని మోదీతో భేటీ నా అదృష్టం : లోకేశ్
X

ప్రధాని సమావేశంలో ఎన్నో సలహాలు, సూచనలు పరస్పరం పంచుకున్నామని లోకేష్ వెల్లడించారు. నా లాంటి యువకుడితో దాదాపు 20 ప్రశ్నలకు ప్రధాని మోదీ ఓపికగా సమాధానం ఇవ్వటం ఆయన గొప్పతనం, ఇది తన అదృష్టమని చెప్పారు. మోదీ సలహాలు సూచనలు తనకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఆయన అనేక సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా లోకేష్ మాట్లాడారు. పార్టీ బలంగా ఉండాలి, సంస్థాగతంగా బాగుండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువతకు పెద్దపీట వేసి ఎమ్మెల్యేలుగా గెలిపించి మంత్రి పదవులు కూడా ఇచ్చామన్నారు. "సీనియర్లు జూనియర్లు కలిసి పనిచేస్తేనే పార్టీ బలంగా ఉంటుందని తెలిపారు. సీనియర్లు నుంచి తాను సలహాలు, సూచనలు తీసుకుంటున్నానని, ఫీడ్ బ్యాక్ అడుగుతున్నానని చెప్పారు. ఫీల్డ్లో పనిచేసిన వారికి పదవులు ఇవ్వటం వల్ల మహానాడుకు ఊపువచ్చిందన్నారు. కార్యకర్తల్లో కసి కనిపిస్తోందని లోకేష్ తెలిపారు.

Tags

Next Story