CM Chandrababu : ఆడబిడ్డలకు అన్నివేళలా అండగా ఉంటా: చంద్రబాబు
ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. టీడీపీ ఆది నుంచి ఆడబిడ్డల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించింది తెలుగుదేశమే. డ్వాక్రా సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. మీకు అన్నివేళలా, అన్నివిధాలా అండగా ఉంటా’ అని ట్వీట్ చేశారు.
సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో నేడు పలు పరిశ్రమలను ప్రారంభించనున్నారు. సీఎంవో వివరాల ప్రకారం ఉండవల్లి నుంచి ఉ.10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీసిటీకి చేరుకుని పలు పరిశ్రమల్ని ప్రారంభిస్తారు. 7 కొత్త సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అనంతరం మధ్యాహ్నం నెల్లూరులోని సోమశిలకు చేరుకుని జలాశయాన్ని పరిశీలిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com