AP : ఐఏఎస్ అధికారిణి వాణి ప్రసాద్‌కు తప్పిన పెను ప్రమాదం

AP : ఐఏఎస్ అధికారిణి వాణి ప్రసాద్‌కు తప్పిన పెను ప్రమాదం
X

ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్‌కు పెను ప్రమాదం తప్పింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళ్తున్న కారును క్రాస్ చేయబోయి ఎదురుగా ఉన్న కారును డీ కొట్టి పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. స్థానికులు ఆమెను ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్‌గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్న కోదాడ ఆర్డీవో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్‌ను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story