YS Jagan : ప్రాణాలు పోతుంటే తప్పుడు ప్రచారమా.. జగన్ ఏంటిది..

YS Jagan : ప్రాణాలు పోతుంటే తప్పుడు ప్రచారమా.. జగన్ ఏంటిది..
X

ఏపీలో చిన్న పొరపాటు జరిగినా సరే.. దానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా సరే.. వైసిపి రకరకాల తప్పుడు ప్రచారాలు చేసి కూటమి ప్రభుత్వంపై బురదజల్లేస్తుంటుంది. మరీ ముఖ్యంగా ఏపీలో ఎవరు చనిపోయినా సరే వైసిపి ఎక్కడలేని తప్పుడు ప్రచారాన్ని తెరమీదకి తెస్తుంది. ఏపీలో ప్రజలు ప్రశాంతంగా ఉండటం బహుశా వైసిపికి నచ్చదేమో. వాళ్ల తప్పుడు ప్రచారం కోసం.. ఏపీలో ఎవరో ఒకరు చనిపోవాలని కోరుకోవడం ఎంత దారుణం. ఇప్పుడు వైసీపీ చేస్తుంది ఇలాంటి దిక్కుమాలిన ప్రచారమే. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట నిజంగా చాలా బాధాకరం.

అందులో ఇప్పటికే 9 మంది చనిపోయారు. దీన్ని ఎవరైనా రాజకీయం చేయాలని చూస్తారా.. ఎందుకంటే కాశీ బుగ్గలో ఆలయం కట్టించింది ప్రైవేటు వ్యక్తి హరి ముకుంద పండా. ప్రతిరోజు 1500 మంది నుంచి 2000 మంది దాకా వస్తున్నారు. అయితే నిన్న కార్తీక శనివారం, ఏకాదశి కావడంతో ఏకంగా 25 వేల మంది వచ్చారు. ఆలయం మొదటి అంతస్తులో ఉండటంతో.. 20 మెట్లు దాకా పైకి ఎక్కి వెళ్లాలి. అక్కడ ఉండే రైలింగ్ ఊడి పడటంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. అంతమంది వస్తారని తమకు కూడా తెలియదన్నారు ఆలయం నిర్వాహకులు. అందుకే తాము పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. అది ప్రభుత్వం నడిపిస్తున్న ఆలయం కాదు కదా.. మరి అక్కడ కూటమి ప్రభుత్వం తప్పు ఎక్కడుంది.

తొక్కిసలాట జరిగిన వెంటనే మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మిగతా భక్తులను అలెర్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకుండా చేశారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కూడా ప్రకటించారు. ఇప్పటికీ గాయపడ్డ వారి కోసం అక్కడే ఉండి వైద్య చికిత్సలు అందించేలా చూస్తున్నారు. ఇంత వేగంగా స్పందించినా సరే.. కూటమి ప్రభుత్వం తప్పు వల్లే తొక్కిసలాట జరిగిందని.. వైసీపీ నేతలు అంటున్నారు. వైసిపి సోషల్ మీడియాలో ఇప్పటికే రకరకాల తప్పుడు పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఎక్కడో కాశీబుగ్గలో అంతమంది వస్తారని ప్రభుత్వానికి కూడా తెలియదు కదా. వాళ్లు ముందే సమాచారం ఇచ్చి ఉంటే.. అప్పుడు బందోబస్తు ఏర్పాటు చేయకుంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలీ. అంతేగాని ఎక్కడ ఎవరు మానవ తప్పిదం వల్ల చనిపోయినా సరే.. కూటమి ప్రభుత్వానికి అంటగట్టి ఫేక్ ప్రచారం చేయడం వైసీపీకి అలవాటు అయిపోయింది.



Tags

Next Story