Chandrababu Naidu : గీత దాటితే వేటు తప్పదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

Chandrababu Naidu : గీత దాటితే వేటు తప్పదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్
X

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక పార్టీలో ఎవరైనా లైన్ దాటితే ఊరుకోవట్లేదు. ఎవరైనా పార్టీ లైన్ దాటి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తే కఠినంగానే ఉంటున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు తిరువూరు ఎపిసోడ్ పై చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో అని టీడీపీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నారంట. తమ్ముళ్ల కుమ్ములాటపై సీఎం చంద్రబాబు గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీకి నష్టం తెచ్చే పనులు ఎవరు చేసినా ఊరుకునేది లేదని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు.

ఇక దుబాయ్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు ఏపీకి వచ్చేశారు. చంద్రబాబు దుబాయ్ వెళ్లాక ముదిరిన తిరువూరు ఎపిసోడ్ పై ఫోకస్ పెట్టారంట. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వివాదం చంద్రబాబు టూర్ లో ఉండగానే సంచలనం రేపింది. ఈ వివాదంపై ఇద్దరిని పిలిచి మాట్లాడుతానని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెబితే చంద్రబాబు వద్దని చెప్పారంట. ఏపీకి వచ్చాక తానే స్వయంగా వారి వివాదాన్ని పరిశీలిస్తానని చెప్పారు. అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై టెన్షన్ పెట్టుకున్నారు. కూటమి నేతల మధ్య ఎలాంటి వివాదాలు ఉండొద్దని.. ఇంకో రెండు టర్మ్ లు కూటమి ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారంట.

అందుకే పార్టీకి, కూటమికి నష్టం తెచ్చేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారంట. టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదని.. ఎంత పెద్ద నేత అయినా చర్యలు ఉంటాయన్నారంట సీఎం చంద్రబాబు నాయుడు. కొలికపూడి ఎపిసోడ్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పార్టీ పరువు తీశారని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారంట. తాము ఎంతో కష్టపడి టీడీపీ ఇమేజ్ పెంచుతుంటే.. ఇలా నేతలు తమ చేష్టలతో పరువు తీయడాన్ని చంద్రబాబు అస్సలు ఉపేక్షించట్లేదు. అందుకే పార్టీ లైన్ దాటితే ఎవరికైనా చర్యలు తప్పవని ఈ ఘటనతో అందరికీ తెలిసేలా చేయాలని చూస్తున్నారంట చంద్రబాబు.


Tags

Next Story