Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి జరిగిన అవమానంపై ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యుల స్పందన..

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి జరిగిన అవమానంపై ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యుల స్పందన..
X
Nara Bhuvaneshwari: చంద్రబాబు భార్య భువనేశ్వరికి జరిగిన అవమానంపై ఎన్‌టీఆర్ కుటుంబం కలత చెందింది.

Nara Bhuvaneshwari: చంద్రబాబు భార్య భువనేశ్వరికి జరిగిన అవమానంపై ఎన్‌టీఆర్ కుటుంబం కలత చెందింది. భువనేశ్వరికి ఆమె సోదరి పురందేశ్వరి బాసటగా నిలిచారు. అసెంబ్లీలో భువనేశ్వరి పై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వ్యక్తిత్వ హననం సహేతుకం కాదని మండిపడ్డారు. తాను, తన సోదరి నైతిక విలువలతో పెరిగామని పేర్కొన్నారు. విలువల్లో రాజీ ప్రసక్తే లేని కుటుంబం తమదని స్పష్టం చేశారు.


భువనేశ్వరికి జరిగిన అవమానంపై నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం చాలా బాధాకరం. తెలుగు ప్రజలందరూ మీ వెంటే ఉన్నారు మామయ్య.. మీరు అధైర్య పడకండి అని చంద్రబాబును ఉద్దేశించి నందమూరి సుహాసిని అన్నారు.

Tags

Next Story