Kurnool: ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన సీఎం జగన్..

Kurnool: కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు.. ఓర్వగల్లు మండలం గుమ్మితం తండాలో సీఎం జగన్ అంకురార్పణ చేశారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం.. కాంక్రీట్ వేసి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు. గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. 4వేల 766 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 5 వేల 410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇక ఒకే యూనిట్ నుంచి సోలార్, పవన, జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. సోలార్ ద్వారా 3వేల మెగావాట్లు, విండ్ 5050 మెగావాట్లు, హైడల్ పవర్ 1860 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం గ్రీన్ కో గ్రూప్ సంస్థ 3 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com