Chandrababu Naidu : ఏపీకి రూ.11 లక్షల కోట్లు పెట్టుబడులు..!

రాజధాని లేకుండా.. అప్పుల ఊబిలోకి ఏపీని వైసీపీ నెట్టేసింది. వైసిపి హయంలో ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఏపీ పేరు చెబితేనే దావోస్ లో కంపెనీలన్నీ ముఖం చాటేసాయి. అత్యంత భయానక పరిస్థితులను వైసీపీ సృష్టిస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తుంది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కంపెనీలు రావాల్సిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక ప్రాంతాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని మేటిగా తీర్చిదిద్దలేము అని చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అందుకే హైదరాబాద్ ను టెక్నాలజీ వైపు తీసుకెళ్లారు కాబట్టే ఇప్పుడు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ముంబైకి లేదా బెంగళూరుకు లేదా హైదరాబాద్ కు ఐటీ కంపెనీలను ఇతర కంపెనీలను తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయి ఉంది. కానీ ఏపీకి అలాంటి పరిస్థితులు లేవు. వైసిపి హయాంలో అభివృద్ధి పాతాళానికి పడిపోయినా సరే.. ఏపీకి ఇప్పుడు ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అంటే అదంతా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం, లోకేష్ కృషి అనే చెప్పాలి. వైసిపి టైములో కంపెనీలు వస్తున్నాయంటూ వైసీపీ లీడర్లే కొన్ని రకాల పేపర్లు చూపించారే తప్ప.. ఒక్క కంపెనీ ప్రతినిధులు కూడా ఏపీకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పిన పరిస్థితులు కనిపించలేదు.
కానీ ఇప్పుడు ఏపీలో ఏకంగా 11 లక్షల కోట్ల పెట్టుబడులు కూటమి హయాంలోనే వచ్చేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో అతి పెద్ద కంపెనీని పెడుతుంది. అది మన కళ్లకు కనిపిస్తోంది. ప్రపంచంలోనే మేటి ఆయన గూగుల్ డేటా.. కావాలనుకుంటే ఏ ముంబైలోనో లేదంటే హైదరాబాద్ లోనో తన సెంటర్ ను ఏర్పాటు చేసుకునేది. కానీ లోకేష్ పదేపదే వెళ్లి ఏకంగా గూగుల్ మెయిన్ ఆఫీస్ లో కూర్చుని మాట్లాడి మరీ వాళ్లను ఒప్పించి.. ఏపీకి తీసుకొచ్చాడు. ఇదొక్కటే కాదు చాలా పేరు మోసిన బడా కంపెనీలు ఇప్పుడు ఏపీకి వస్తున్నాయి. దానికి బెస్ట్ ఉదాహరణ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ. వాస్తవానికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దాని డిమాండ్ కు చాలా తేడా ఉంటుంది. వాటిని బేరీజు వేసుకొని ఖర్చులపరంగా ఆ కంపెనీ వెనక ముందు ఆడింది. అలాంటి టైంలో ఆ కంపెనీ ఎక్కడ మిస్ అవుతుందో అని చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ పోర్ట్ తోపాటు లాజిస్టిక్ ఖర్చులను తగ్గించి ఎగుమతుల్లో లాభాలు తీసుకోవచ్చని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అప్పుడు ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకుంది. ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి కావాల్సింది ఇదే కదా. ఒక కంపెనీ పోతే ఏంటి అని ఆయన అనుకోవచ్చు. కానీ ఏపీకి ఉపయోగపడుతుంది భవిష్యత్తు తరాల్లో ఏపీకి తలమానికంగా మారుతుంది అని ఆయన భావించాడు కాబట్టే ఒక్క కంపెనీని కూడా విడిచిపెట్టకుండా ఏపీకి తీసుకొస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ ఇలాగే జరిగింది.
వైజాగ్ లో ఆ కంపెనీ ఏర్పాటు చేస్తాం అన్నప్పుడు.. గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కావాలని కంపెనీ ప్రతినిధులు అడిగారు. దానికి చంద్రబాబు నాయుడు రెండు మూడుసార్లు మీటింగ్ లు పెట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించి వారికి అవకాశాన్ని కల్పించారు. అంతేగాని ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టు జగన్ లాగా బిహేవ్ చేయలేదు. ఇలా చంద్రబాబు నాయుడు కల్పిస్తున్న వెసలుబాటులను చూసి మిగతా కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. మొన్నటికి మొన్న క్వాంటమ్ కంప్యూటర్స్ ను ఏ దేశానికి అంటే ఆ దేశానికి ఎగుమతి చేస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం ఏంటి.. తనకెందుకు అంత రిస్కు అంటే ఏపీ ప్రజల బాబు కోసం ఏపీ ప్రాంత అభివృద్ధి కోసమే కదా అంటున్నారు టిడిపి శ్రేణులు. ఐటీ రంగం ఇప్పుడు సంక్షోభంలో ఉంది. ఇలాంటి సమయంలో కూడా టిసిఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు వైజాగ్ లో పెట్టుబడులు పెడుతున్నాయి అంటే అదంతా చంద్రబాబు నాయుడు, లోకేష్ కృషి పట్టుదల అనే చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com