BABU: దార్శనికుడైన చంద్రబాబును అరెస్ట్ చేస్తారా

BABU: దార్శనికుడైన చంద్రబాబును అరెస్ట్ చేస్తారా
మండిపడ్డ మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల... చంద్రబాబుకు వెల్లువెత్తుతోన్న మద్దతు....

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా దార్శనికుడని, అలాంటి ప్రజా నాయకుడి అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండించాలని పౌరహక్కుల నేత, మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, మానవహక్కులపై ఏ మాత్రం గౌరవం ఉన్నా చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, ఇరోమ్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. చంద్రబాబు లాంటి ప్రజా నాయకుడిని అక్రమంగా జైల్లో నిర్బంధించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిస్తూవీడియోవిడుదల చేశారు.


చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడు. ఒకవేళ దేశవ్యాప్తంగా రాజకీయ నేతల అవినీతికి వ్యతిరేకంగా సహేతుకమైన దర్యాప్తు జరిగితే ఈడీ ఇంతవరకు ఒక్క బీజేపీ నేతపై కూడా ఎందుకు కేసు పెట్టలేదని ఇరోమ్‌ షర్మిల ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేసేందుకు మోదీనే చేయిస్తున్నారని స్పష్టమవుతోందని ఆమె అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు వెల్లువెత్తుతోంది. టీడీపీ నేతలతో పాటు.. చంద్రబాబును సపోర్ట్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మమతా బెనర్జీ, కుమారస్వామి లాంటి నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం చంద్రబాబుకు మద్దతు తెలిపాడు. నారా లోకేష్‌కు రజినీ కాల్ చేసి మాట్లాడాడు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా అన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని రజనీకాంత్‌ పేర్కొన్నారు.


టాలీవుడ్‌ నుంచి రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌, నారా రోహిత్, నట్టి కుమార్‌ చంద్రబాబుకు మద్దతు తెలపగా తాజాగా ప్రముఖ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ టీడీపీ అధినేత అరెస్టుపై స్పందించింది. 73 ఏళ్లు అంటే జైల్లో ఉండాల్సిన వయసు కాదని, ప్రజా జీవితంలో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన తర్వాత ఇలా జైల్లో ఉండడం బాధాకరమని పూనమ్‌కౌర్‌ ట్వీట్‌ చేసింది.


మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇంచార్జ్ పీ.ఎస్. ఎన్.రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం రాజమహేంద్రవరంలో లోకేశ్ ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story