Google Data Center : విశాఖకు ఐటీ కంపెనీల క్యూ..!

విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖ అత్యంత వేగంగా పెట్టుబడులకు కేంద్రంగా మారిపోయింది. ఇంటర్నేషనల్ కంపెనీలతోపాటు.. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అనేక కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు అగ్రిమెంట్లు చేసుకుని సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక విశాఖ చరిత్రలో తలమానికంగా ఉన్న గూగుల్ డేటా సెంటర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గూగుల్ అనుబంధ సంస్థ ఇక్కడ మూడు డేటా సెంటర్ లను దాదాపు 88 వేల కోట్లతో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే బిల్డింగ్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగబోతుంది అందులో దీనిపై క్లారిటీ రానుంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో విశాఖకు ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే టిసిఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి ఐటీ దిగ్గజ సంస్థలు ఇప్పుడు విశాఖకు వచ్చాయి. అక్టోబర్ 14న ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ మధ్య ఒప్పందం జరగనుంది. లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఆ ఒప్పందం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలకు ఏపీ హబ్ గా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ కు ఉండే అతికొద్ది డేటా సెంటర్లలో ఇప్పుడు అవి ఏపీలో ఉండటం అంటే నిజంగా గొప్ప విషయమే కదా. అందుకే ఈ ఒప్పందం ఇప్పుడు మిగతా ఐటీ సంస్థలను ఏపీకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే నెలలోనే టిసిఎస్ విశాఖలో అడుగుపెట్టనుంది. మిగతా కంపెనీలు కూడా బిల్డింగుల నిర్మాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీ ఎంతో ముఖ్యం అనేది చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అందుకే ఒకప్పుడు ఐటిని ఎంకరేజ్ చేసిన ఆయన నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏఐ డేటా సెంటర్లను ఏపీకి తీసుకు రాగలిగారు. భవిష్యత్తు అంతా ఏఐదే అని తెలుసుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనూ ఏఐని బాగా వాడుతున్నారు. ఏఐకి తోడు టెక్నాలజీ, ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధిలో నడిపించడం ఆయన ప్రధాన ఉద్దేశం అని టిడిపి నేతలు అంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com