కొత్త టీచర్లకు మొదట జీతాలు ఎలా ఇస్తారో తెలుసా?

కొత్త టీచర్లకు మొదట జీతాలు ఎలా ఇస్తారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో త్వరలోనే 6వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీ కానున్నాయి. డీఎస్సీ పరీక్ష నిర్వహణకు జగన్ (Jagan) సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఖాళీల భర్తీ కోసం వివిధ కేటగిరీల్లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ 12న రిలీజ్ కానుంది.

జగన్ ప్రభుత్వం డీఎస్సీ కంటే ముందే అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు సిద్ధమైంది. క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులు. డీఎస్సీలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి.. రెండేళ్ల పాటు అప్రెంటిస్ షిప్ చేయాల్సి ఉంటుంది.

పరీక్ష రాసి సెలెక్టైన ఉపాధ్యాయులకు మొదటి రెండేళ్లలో గౌరవ వేతనం పే చేస్తారు. ఈ గౌరవ వేతనంపై ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చింది. ఎంపికైన టీచర్లకు తొలి ఏడాది వారి బేసిక్ పేలో 50 శాతం గౌరవ వేతనంగా చెల్లిస్తారు. రెండో ఏడాది బేసిక్ లో 60 శాతాన్ని గౌరవ వేతనంగా పే చేయాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్ కి బేసిక్ గా ఉన్న రూ.32వేల 670లో 50 శాతం అంటే రూ.16వేల 335లను అప్రెంటిస్ ఫస్ట్ ఇయర్ శాలరీగా ఇస్తారు. రెండో ఏడాది ఈ మొత్తం రూ.19వేల 602కు పెరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్లు, టీజీజీలకు తొలి ఏడాది రూ.22వేల 285.. రెండో ఏడాది రూ.26వేల 742 పే చేస్తారు. పీజీటీలకు అప్రెంటిస్ టైంలో రూ.24వేల 220... రూ.29వేల 064ని గౌరవ వేతనం అందనుంది.

Tags

Read MoreRead Less
Next Story