AP : జగన్ ఆర్థిక ఉగ్రవాది : మంత్రి పయ్యావుల కేశవ్

AP : జగన్ ఆర్థిక ఉగ్రవాది : మంత్రి పయ్యావుల కేశవ్
X

ఐదేళ్ల పాలలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్ర సంపద పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. ‘బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో అనేకమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. పోలవరం పనులు నిలిపేసి డయాఫ్రంవాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారు’ అని ఆరోపించారు. చట్ట సభల అనుమతి లేకుండా రూ.634 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్‌ చెప్పింది. అనుమతి లేని ఖర్చులు ఎవరి కోసం చేశారు? ఎందుకు చేశారు? వైకాపా హయాంలో పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయారు. చంద్రబాబు వచ్చాక మళ్లీ అనేక మంది వస్తున్నారు. అమరావతి విధ్వంసం.. విశాఖ భూ దోపిడీ మీ అరాచకం కాదా? సంక్షేమం.. అభివృద్ధి.. బ్యాలెన్స్‌ చేసుకుంటూ బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారు. అమెరికా పర్యటనలో ఆయన 90 మంది పారిశ్రామికవేత్తలను కలిశారు

Tags

Next Story