JAGAN: నేడే జగన్ నర్సీపట్నం పర్యటన

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. 18 కండీషన్లతో పోలీసులు ఈ అనుమతులు ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకులు కూడా అంగీకరించారు. వైఎస్ జగన్ పర్యటన కు రోడ్డు మార్గాన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తునట్టు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్. శంఖబ్రత బగ్చి తెలిపారు. విమానాశ్రయం నుండి ఎన్ఏడి, పెందుర్తి, సరిపల్లి మీదుగా జాతీయ రహదారి గుండా, అనకాపల్లి, తాళ్లపాలెం మీదుగా, మాకవరపాలెం చేరుకోవాలని సూచించారు. రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి 10 వాహనాలకు అనుమతి ఇస్తున్నామని అధికారులు స్పష్టం చేసారు. నిబంధనలు, పాటించడంలో విఫలమైతే వెంటనే అనుమతిని రద్దు చేయడం, చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని ఏదైనా గాయం, ప్రాణనష్టం లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తికి జరిగే నష్టానికి నిర్వాహకుడు వ్యక్తిగతంగా, పరోక్షంగా బాధ్యత వహించాలని తెలిపారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. న్యూయార్క్ పర్యటన నిమిత్తం తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు సానుకూలంగా స్పందించింది. కొన్ని షరతులకు లోబడి ఆయనకు పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు.
నకిలీ మద్యం కేసు.. నిందితుడు అరెస్ట్
మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మద్యం తయారీకి షెడ్డు లీజుకు తీసుకున్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A12గా ఉన్న అతడు తెనాలిలోని ఐతానగర్‌లోని ఓ అపార్టుమెంట్లో కుంటుంబంతో ఉంటున్నాడు. తెనాలికి వచ్చిన ఎక్సైజ్ పోలీసులు శ్రీనివాసరావు కోసం వెతకగా అప్పటికే ఆప్పటికే పరారయ్యాడు. కొన్నేళ్లుగా తెనాలిలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు వైసీపీ లో క్రియాశీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ పోలింగ్ ఏజెంట్‌గానూ వ్యవహరించారని సమాచారం. మొలకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి సంబంధించిన షెడ్డు శ్రీనివాసరావు పేరుతో లీజుకు తీసుకున్నట్లుగా తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com