YS Jagan : కోర్టుకు వెళ్లడానికి ఏమైంది జగన్.. ఏంటీ సాకులు..?

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్నన్ని అవినీతి కేసులు బహుషా ఇంకెవరి మీద ఉండవేమో కదా. ఆయన మీద ఉన్న కేసుల విచారణకు హాజరు కాకుండా ఆయన వర్చువల్ గా కోర్టులకు హాజరవుతానని చెబుతున్నారు. సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, పరిపాలన ముఖ్యం అంటూ తప్పించుకున్నారు. ఇప్పుడు అధికారం పోయాక కూడా హెల్త్ ప్రాబ్లమ్స్, వ్యక్తిగత పనులు అంటూ పనికిమాలిన కారణాలు చెబుతూ తప్పించుకునేప్రయత్నం చేస్తున్నాడు. ఆయనపై ఉన్న అవినీతి కేసుల విచారణకు హాజరుకావాల్సిన సందర్భాల్లో తరచూ వివిధ సాకులు చెప్పి దూరంగా ఉంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్‌పై ఉన్న అవినీతి, ఆస్తుల వ్యవహారాల కేసులు చాలా కాలంగా కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ కేసుల సంఖ్యను చూస్తే బహుశా ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న మరో మాజీ సీఎం లేరని చెప్పవచ్చు. సీఎంగా ఉన్న సమయంలో ఆయన తరచూ “సెక్యూరిటీ కారణాల వల్ల వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యం కాదు” అంటూ వర్చువల్ హాజరు కోరేవారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత పనులు అంటూ తప్పించుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయనకు నిజంగా ఇంతవరకు కోర్టుకు హాజరయ్యే సమయం దొరకలేదా? లేక ఇది కేవలం ఆలస్యం చేయడానికి సాకుగా చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టు సమన్లు జారీ చేసినప్పుడల్లా కొత్త కొత్త సాకులు చెప్పడం జగన్ కు అలవాటు అయిందని అంటున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, చట్టం ముందు అందరూ సమానమే. కానీ జగన్ కు ఈ ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం ఏంటని అంతా అనుకుంటున్నారు. ఎంత మాజీ సీఎం అయినా సరే కోర్టులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అందరిలాగా తాను రాలేను అని చెబితే ఎలా.. ఇదే సామాన్యులు అయితే ఈ పాటికి బెయిల్ రద్దు అయ్యేది. 12 ఏళ్లుగా బెయిల్ మీదనే బయట తిరుగుతున్న జగన్.. కేసులను కావాలనే సాగదీస్తున్నట్టు అర్థమవుతోంది. అందుకే ఇలాంటి సాకులు చెప్పి రకరకాల పిటిషన్లు వేసి కాలం గడిపేస్తున్నారు.
Tags
- Jagan Mohan Reddy
- corruption cases
- court hearings
- virtual attendance
- excuses
- health reasons
- security reasons
- bail
- delay tactics
- former Chief Minister
- Andhra Pradesh
- criticism
- legal proceedings
- court summons
- avoidance
- accountability
- governance
- investigation
- political controversy
- public reaction
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

