YS Jagan : ఎందుకంత అక్కసు జగన్..

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారం పోయి రెండేళ్లు అవుతున్నా సరే ఇంకా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవట్లేదు. ఇప్పటికి కూడా సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే ఓర్వలేక పోతున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడానికి అసలైన రీజన్ ఇదే అనే చర్చ కూడా ఉంది. సీఎం స్థానంలో చంద్రబాబు నాయుడు కూర్చుంటే అది చూసి తాను తట్టుకోలేనని.. సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండటం తనకు ఇష్టం లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అందుకే ప్రధాన ప్రతిపక్ష హోదా అనే ఒక కారణం చూపించి అసెంబ్లీకి రావట్లేదని తెలుస్తోంది.
నేడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన.. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చూసి వెంటనే ముఖం మాడ్చూకున్నారు. ఏదో ఇష్టం లేనట్టు బలవంతంగా వచ్చి తన సీట్లు కూర్చున్నారు. ఆయన హావభావాలు చూసిన వారికి ఎవరికైనా సరే.. ఏదో ఇష్టం లేని కార్యక్రమానికి వచ్చినట్టే కనిపిస్తోంది. అందుకే గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలి మరి బయటకు వెళ్ళిపోయారు వైసిపి నేతలు. అసలు కూటమి నేతలు ఏమీ మాట్లాడక ముందే.. తమంతట తామే బయటకు వెళ్లిపోవడం అంటే వైసిపి ఎమ్మెల్యేల తీరును, జగన్ అక్కసను ఎక్కడ అర్థం చేసుకోవచ్చు.
అంటే ఎంతసేపు తానే సీఎంగా ఉండాలి తప్ప.. వేరే వాళ్ళు ఆ సీట్లో కూర్చుంటే తాను ఓర్వలేక పోతున్నాడు అనే విషయాన్ని జగన్ ఇప్పుడు కూడా బయట పెట్టుకున్నాడు. ప్రజల సమస్యల మీద స్పందించిన చరిత్ర జగన్ కు ఎన్నడూ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు మీద అక్కసుతోనే ఎన్నో రకాల బురదజల్లే కార్యక్రమాలను తీసుకుంటూనే ఉన్నాడు జగన్. ఇప్పుడు స్వయంగా అసెంబ్లీకి వచ్చి మరి చంద్రబాబు మీద అక్కసును బయట పెట్టుకున్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
