YS Jagan : తగ్గాలి జగన్.. రూల్ అందరికీ ఒకటే..

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కోర్టు హాజరు విషయంలో వెనక్కి తగ్గారు. ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కఠినంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ అధికారులు కోర్టులో సమాధానం ఇస్తూ.. “జగన్ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలి” అని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లేదా లాయర్ ద్వారా హాజరును ఒప్పుకోలేదు. దీనితో జగన్ తానే వ్యక్తిగతంగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. అయితే ఆయన కోర్టు ముందు హాజరవడానికి ఈ నెల 21 వరకు సమయం ఇవ్వాలని కోరాడు. దానికి సీబీఐ కోర్టు అంగీకరించింది.
గత నెలలో జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్టోబర్ 1 నుండి 30 మధ్య 15 రోజులపాటు యూరప్ టూర్‌కు ఆయనకు కోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఆ పర్యటన తరువాత నవంబర్ 14న కోర్టుకు రావాలని ముందే సీబీఐ కోర్టు చెబితే.. దాన్ని లెక్కచేయకుండా తాను రాను అంటూ పిటిషన్ వేశాడు జగన్. తన బదులు లాయర్ వస్తాడని లేదంటే వీడియో కాన్ఫరెన్స్ రూపంలో హాజరుకావడానికి అనుమతించాలని పిటిషన్ వేశారు. కానీ ఎదురు దెబ్బ తగిలింది. మరి అంతే కదా.. కోర్టులు అంటే అందరికీ సమానమే. జగన్ ఒక్కడికే సెపరేటుగా రూల్స్ ఉండవు కదా. ఈ విషయాన్ని జగన్ గుర్తించాలి. చట్టం ముందు అందరూ సమానమే అనే విషయం బహుషా జగన్ కు ఇంకా అర్థం కావట్లేదేమో.
అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ మీద జగన్ బయట తిరుగుతున్నాడు. కానీ బెయిల్ రూల్స్ ను కూడా చాలా సార్లు బ్రేక్ చేశాడు. ఏమైనా అంటే పిటిషన్లు వేసి తప్పించుకుంటున్నాడు. ఇక కోర్టుకు కూడా రాను అని చెప్పడం ఏంటి. కోర్టు ముందు హాజరు అవ్వాలి గానీ.. ఇలా తాను రాను అని చెప్పడం అంటే కోర్టులను అగౌరవ పరచడమే అంటున్నారు న్యాయ నిపుణులు. ఒక మాజీ సీఎం హోదాలో ఉన్నారు కాబ్టటి ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు సీబీఐ దెబ్బకు చివరకు వస్తానని చెప్పాడు. మరి రూల్ అంటే అంతే కదా. జగన్ ఒక్కడికే సెపరేట్ రూల్ ఏమీ ఉండదని గుర్తించాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

