JAGAN: చంద్రబాబు చావు కోరుకుంటున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందని విమర్శించారు. రైతుల తరఫున మేం నిరసనలు చేస్తే ఏం తప్పు అని అడుగుతున్నా.. ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే మాట్లాడకూడదా అన్నారు. ప్రజాస్వామ్యం కూని కావటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు రైతులకు అందివ్వాల్సిన ఎరువులు అందిస్తే ఈ పరిస్థితి ఉండదు కదా అన్నారు. రువుల కోసం రైతులు రాత్రనక, పగలనక పనులు మానుకుని ఎదురు చూడాల్సిన వచ్చింది.. అర్ధరాత్రి సమయంలో వెళ్లి క్యూ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.. కనీసం కుప్పంలో కూడా చంద్రబాబు రైతులకు ఎరువులు ఇవ్వలేకపోయారు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
పప్పు బెల్లాలకు అమ్మేసుకున్నారు
1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి అని జగన్ గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు మూడుసార్లు సీఎంగా పని చేసినా ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా కట్టలేదు అని ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమంటే అవినీతికి పరాకాష్ట అని వైఎస్ జగన్ అన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి NMC 50 సీట్లు అనుమతులు ఇస్తే చంద్రబాబు వద్దని వెనక్కి పంపారు అని వైసీపీ చీఫ్ జగన్ పేర్కొన్నారు. ఇంతకీ చంద్రబాబు మనీషా రాక్షసుడా మీరే ఆలోచించాలని తెలిపారు. మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తే, రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుంది అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు లేకుండా ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com