Jagan : పోలీసుల పైకి దూసుకెళ్లిన జగన్ కాన్వాయ్.. చెప్పినా వినరా..!

మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన తీవ్ర వివాదాల మధ్య సాగింది. ఆయనకు అడుగడుగునా దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. డాక్టర్ సుధాకర్ ను అత్యంత దారుణంగా వైసీపీ పొట్టనబెట్టుకుందని గుర్తు చేశాయి దళిత సంఘాలు. గో బ్యాక్ జగన్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి.. నిరసనలు తెలిపారు. అయినా సరే జగన్ మాత్రం సుధాకర్ అంటే ఎవరో తెలియదన్నట్టు కనీసం అతని గురించి మాట్లాడలేదు. ఇక అంతటితో ఆగకుండా జగన్ కు బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల మీదకే ఆయన కాన్వాయ్ దూసుకెళ్లింది. కొద్దిలో మిస్ అయింది.
లేదంటే పోలీసులకు కాన్వాయ్ ఢీ కొట్టేది. ఈ దుశ్చర్యపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు కాన్వాయ్ ను ఆపి మరీ పై స్థాయి అధికారులు సీరియస్ అయ్యారు. ఓ వైపు తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోతున్న ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు ఇంత కష్టపడి బందోబస్తు కల్పిస్తుంటే.. జగన్ మాత్రం అవేవీ పట్టనట్టు ఏకంగా పోలీసుల మీదకే తన కాన్వాయ్ వెళ్లినా కనీసం స్పందించలేదు. అదంతా కామనే అన్నట్టు సైలెంట్ గా కారులోనే ఉండిపోయారు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అప్పుడు పోలీసుల మీదకు తప్పును తోసేయడం వైసీపీ బ్యాచ్ కు అలవాటే కదా. అందుకే ఇలాంటి దుశ్చర్యకు దిగారేమో అంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు.
ఎంత వద్దని చెప్పినా వినకుండా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున జనాలను కూడగొట్టారు. జగన్ వచ్చిన టైమ్ లో ఒకింత తోపులాట కూడా జరిగింది. ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అనే టెన్షన్ తో పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడంటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే వైసీపీ నేతలు గానీ, జగన్ గానీ చెబితే వినే పరిస్థితిలో లేరు. తమ ఇష్టారాజ్యంగా పోలీసుల ఆంక్షలను తుంగలో తొక్కేసి బిహేవ్ చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఓ వైపు ప్రపంచ వరల్డ్ కప్ జరుగుతుంటే.. ఇంకోవైపు ఇలాంటి ఘటనలు జరగడం అంటే శాంతిభద్రతలకు లోటు కలిగితే దేశ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అవుతుందని పోలీసులు టెన్షన్ పడుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com