మెడికల్ కాలేజీలపై జగన్ తప్పుడు ప్రచారం.. నిజాలు ఇవే..

ఎన్నో నిరసనలు, ఉద్రిక్తతల నడుమ మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటన సాగింది. అయితే తన హయాంలో కనీసం పిల్లర్ల దాకా కూడా కట్టని మెడికల్ కాలేజీ ముందు నిలబడి.. కూటమి ప్రభుత్వంపై నానా రకాల నిందలు వేసేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. జగన్ తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకొక మెడికల్ కాలేజీ కడితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ మాఫియాకు కట్టబెడుతోందన్నారు. ఇది దారుణం అని, అన్యాయం అని.. ప్రైవేట్ వాళ్లకు ప్రభుత్వం అమ్ముడు పోయిందన్నారు. మూడు కాలేజీలను తన హయాంలో కంప్లీట్ చేశానని.. మిగతా 14 కాలేజీలను నిర్మించకుండా ప్రైవేట్ పరంగా చేస్తుందన్నారు.
ఇక్కడే కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఆయన నిల్చున్న నర్సీపట్నం మెడికల్ ఇంకా కంప్లీట్ కానేలేదు. ఆ పూర్తి చేసిన కొద్ది నిర్మాణం కూడా కేంద్రం నిధులతోనే కంప్లీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో కానే కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించట్లేదు. పీపీపీ పద్ధతిలో చేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ పద్ధతి ఉంది. ప్రభుత్వ కోటాలో సీట్లు ఏ మాత్రం తగ్గవు. ప్రైవేట్ కోటాలో సీట్లు పెరుగుతాయి. హైకోర్టు కూడా పీపీపీ విషయంలో పిటిషనర్లను తిట్టిపోసింది. ప్రభుత్వం దగ్గర ఆ స్థాయిలో డబ్బులు లేవు కదా.. ఈ పద్ధతిలో బిల్డింగులు పూర్తి అవుతాయి. కానీ సీట్లు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి కదా అని హైకోర్టు కూడా తెలిపింది.
ప్రభుత్వానికి పనులు జరుగుతాయి అనుకున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు.. మా కోర్టుల బిల్డింగులు కూడా పూర్తి కావట్లేదు.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇలా చేస్తే తప్పులేదు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంత కరెక్ట్ గా కోర్టులు చెప్పిన తర్వాత కూడా వైసీపీ ఇలాంటి డ్రామాలు ఆపట్లేదు. జగన్ హయాంలో కట్టని బిల్డింగుల మీదకు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ బిల్డింగులు కంప్లీట్ చేయడానికి తొమ్మిదేళ్లు పడుతుందని జగనే చెబుతున్నారు. మళ్లీ త్వరగా పూర్తి చేయకుండా ప్రైవేట్ కు అప్పగిస్తున్నారని ఆయనే అంటారు. ప్రభుత్వం మొదటి నుంచి స్పష్టంగా చెబుతోంది. ప్రైవేట్ వాళ్లకు ఈ మెడికల్ కాలేజీలను అప్పగించట్లేదని.. కేవలం బిల్డింగుల నిర్మాణం పూర్తి చేయడం కోసమే ఈ విధానాన్ని ఎంచుకున్నామని తెలిపింది. స్టూడెంట్లకు విద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని స్పష్టమైనా హామీ ఇస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com