AP : జగన్ ఐదు నిముషాల షో.. ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు

AP : జగన్ ఐదు నిముషాల షో.. ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు

సోమవారం ఐదు నిముషాలు వచ్చి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి షో చేసి వెళ్లారని కనీసం ఒక్కరికైనా ఒక్క పొట్లం ఆహారం ఇచ్చారా... ఒక్క రినైనా రక్షించారా... కనీసం పలకరించారా అని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. వికృత చర్యలకు పాల్పడుతూ డ్రగ్ మాఫియా డాన్ లాగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

కొందరు అధికారులను వీఆర్లో పెట్టామని, వీఆర్లో పెడితే పనిచేయరా, జీతం తీసుకోవడంలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఉంటేనే మనం ఉంటామని, వారు ఇబ్బందులలో ఉంటే మీన మేషాలు లెక్కేస్తారా అని మండిపడ్డారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదేశాలిచ్చినా కొందరు అధికారులు ఇంకా పనిచేయడంలేదని బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆ తరువాత మీరే చూస్తారని మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆనాడు ప్రధాని హుద్ హుద్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అభినందించారని ఇప్పుడు కూడా రాష్ట్రానికి మీరున్నారుగా భయం లేదని చెప్పారని ఆ నమ్మకాన్ని ప్రజల భరోసాను నిలబెట్టుకునేందు కు తాను పనిచేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags

Next Story