Jagan : జగన్ నర్సీపట్నం టూర్ అట్టర్ ప్లాప్.. ఎందుకీ బిల్డప్ లు.

మాజీ సీఎం జగన్ చేసిన నర్సీపట్నం టూర్ అట్టర్ ప్లాప్ అయింది. జగన్ ఎంచుకున్న కాలేజీ.. చేసిన రొటీన్ రొట్టకొట్టుకు ప్లాన్.. ఇచ్చిన బిల్డప్ తో జగన్ నవ్వుల పాలు అయిపోయారు. జగన్ ఈ టూర్ లో కూడా రొటీన్ గా వాడే స్క్రిప్ట్ నే వాడేశారు. తాను బయటకు వస్తే చాలు వేల మంది తన చుట్టూ ఉండాలని అనుకుంటాడు. నర్సీపట్నంలో టూర్ లో కూడా ఇదే ప్లాన్ రిపీట్ చేశారు. వేల మంది తనకు వెల్కమ్ చెప్పడం.. అక్కడక్కడా వినతిపత్రాలు తీసుకుంటున్నట్టు స్క్రిప్ట్ రాయించుకోవడం జగన్ కు అలవాటే. సిద్ధం సభలకు కూడా లక్షల మంది జనాలను రప్పించారు. మరి ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఎందుకు ఓడిపోయారు. ఎందుకంటే వచ్చిన జనం ఓట్లేసేవారు కాదు. వాళ్లంతా పెయిడ్ కార్యకర్తలే అని తేలిపోతోంది.
ఇక పిల్లర్లు కూడా పూర్తికాని నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లడం మరో ప్లాప్ నిర్ణయం. జగన్ టైమ్ లో రెండు, మూడు కాలేజీలకు రంగులు కూడా వేసుకున్నారు. లోపల పెద్దగా పనులు కాకపోయినా రంగులు వేసుకున్న కాలేజీల ముందుకు వెళ్లినా బాగుండేది. కానీ పిల్లర్ల స్థాయిలో ఆగిన మెడికల్ కాలేజీ ముందుకు వెళ్లి.. ఇదిగో దీన్ని నేనే కట్టాను అంటే అక్కడ కూడా పరువు పోయింది. దాన్ని ఎందుకు జగన్ కంప్లీట్ చేయలేదనే ప్రశ్నలే వస్తున్నాయి. ఈ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషనే లేదు. కానీ తన ప్రభుత్వం ఇచ్చిన జీవోను చూపించి పరువు పోగొట్టుకున్నారు. ఇక ఎయిర్ పోర్టు నుంచి భీమబోయినపాలెం వరకు అంటే 63 కి.మీ. వరకు పెద్ద ర్యాలీ తీసుకున్నారు.
అయితే ఈ ర్యాలీలో ఎక్కడా ఆయన వెనకాల పెద్దగా జనాలు లేరు. కేవలం కారు ముందు ఓ యాభై మంది మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడే జగన్ కు ఏ స్థాయి ఆదరణ ఉందో అర్థమైపోయింది. మామూలు జనాలు ఆయన కోసం రాలేదు. ఇక వినతిపత్రాలు తీసుకునే టైమ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని కూడా వినతి పత్రాలు వచ్చాయని.. ఆయన తాడేపల్లికి రండి మాట్లాడుకుని ప్రైవేటీకరణ ఆపేద్దాం అని చెప్పడం మరి కామెడీలా అనిపించింది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేసి కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో అయిపోయిన టాపిక్ మీద ఈయన ప్రకటన చేయడం హాస్యాస్పందం. ఆయన ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం రాజకీయం చేసేస్తున్నారు. ఇక చనిపోయిన డాక్టర్ సుధాకర్ విషయంలో ఆయనకు అడుగడుగునా నిరసనలే వచ్చాయి. ఇలా అట్టర్ ప్లాప్ టూర్ తో జగన్ మరోసారి విమర్శల పాలు అయ్యారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com