ఎన్నికల కోసం జనసేన నేత పవన్ కళ్యాణ్ ఫోకస్

జనసేన(janasena) అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. టీడీపీతో(TDP) పొత్తు కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. సీట్ల పంపకాలపై చంద్రబాబుతో(chandra babu) మాట్లాడుతూ ప్రచారంపైనే దృష్టి పెట్టారు. గతేడాది వారాహి విజయ యాత్ర(vaarahi vijaya) తర్వాత ఆయన పెద్దగా బహిరంగంగా కనిపించలేదు. అయితే త్వరలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా అనేక పర్యటనలు చేపట్టాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో జనసేన కమిటీలను నియమించారు.
రాష్ట్రాన్ని ఉత్తర ఆంధ్ర, గోదావరి, మధ్య ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా విభజించారు. ప్రతి మండలంలో కోఆర్డినేటర్లు, కో-కన్వీనర్లు, కమిటీ సభ్యులు, న్యాయవాద బృందం, వైద్య బృందం ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి రోడ్ మ్యాప్, పోలీస్ క్లియరెన్స్, ప్రమాదాలు జరిగితే తక్షణ వైద్య సహాయం అందించడంపై జనసేన పార్టీ దృష్టి సారించింది.
మరోవైపు ఈ నెలాఖరులోగా సీట్ల పంపకంపై టీడీపీ నుంచి పవన్ క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నారు. అభ్యర్థులెవరో తెలిస్తే ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చునన్నది పవన్ ఆలోచన. ఇక చంద్రబాబు కూడా సీట్ల పంపకాన్ని వెంటనే చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ దూకుడుగా పావులు కదుపుతున్నారు. వైసీపీ పూర్తి జాబితా విడుదలయ్యాక దీనిని బట్టి బలమైన నేతలను రంగంలోకి దించాలని పవన్, చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com