PAWAN: భీమవరాన్ని వదలను

PAWAN: భీమవరాన్ని వదలను
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

సిద్ధం సిద్ధం అంటున్న CM జగన్ కు యుద్ధాన్నే ఇద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులును.. పార్టీలో చేర్చుకున్నారు. ఆయన రాక..జనసేనకు చాలా కీలకమని పవన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. భీమవరంలో ఓడిన వ్యక్తి అలయెన్స్ ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడని తెలిపారు. ఒక్కరి వద్ద డబ్బు, అక్రమ అధికారం, కిరాయి సైన్యం చేరితే ఎవరూ బతకలేరని అన్నారు. భీమవరంలో ఉండే కుబేరులు.. ఓ రౌడీ ఎమ్మెల్యేకు భయపడాల్సి వస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలిచి తీరాలని పవన్ అన్నారు.


దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుందని పవన్‌ అన్నారు. జగన్‌ తాలూకూ జలగలను తీసిపారేయాలి.. భీమవరంలో ఉండే జలగతో సహా వీధిరౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చా. భీమవరం వదలను.. నాది. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలన్నారు జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ అవుతుందిని సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తోన్న వ్యక్తికి యుద్ధమే ఇద్దామని అన్నారు.


ఈ నెల 17 న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరుకానున్న నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్వయంగా సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కూటమి తొలి బహిరంగ సభ నిర్వహణపై మూడు పార్టీల నాయకులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో దాదాపు దశాబ్దం తర్వాత 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖచిత్రం మళ్లీ ఆవిష్కృతం కానుంది. చిలకలూరిపేటలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... ఒకే వేదికను పంచుకోనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story