AP : 10వేల మందికి ఉద్యోగాలు.. లోకేశ్ సమక్షంలో ప్రభుత్వంతో ANSR ఎంవోయూ

ఏపీ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ స్థాపన, నిర్వహణలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ANSR సంస్థ విశాఖపట్నంలో GCCs కోసం ఒక ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్‌ను స్థాపించడానికి ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ANSR సంస్థ మధురవాడ IT క్లస్టర్‌లో అత్యాధునిక GCC ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ క్యాంపస్ ద్వారా రాబోయే ఐదేళ్లలో 10వేలమందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. ఏపీలోని అత్యుత్తమ ప్రతిభ గల పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకోవడంలో ప్రపంచస్థాయి సంస్థలకు ANSR మద్దతునిస్తుంది.
ప్రెస్టేజ్ గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జాయాద్ నోమాన్ లతో బెంగుళూరులో లోకేశ్ భేటీ అయ్యారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రెస్టేజ్ గ్రూప్ ప్రతినిధులను ఆయన కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని.. సుమారు రూ.65వేల కోట్లతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల రాకతో విశాఖపట్నం ఐటి హబ్ గా మారుతోందని.. అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన ఏపీ రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, ప్లగ్ అండ్ ప్లే మోడల్ ప్రిబిల్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సదరు సంస్థ సానుకూలంగా స్పందించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com