KA Paul : పాస్టర్ మృతిపై కేఏ పాల్ రచ్చ రచ్చ

KA Paul : పాస్టర్ మృతిపై కేఏ పాల్ రచ్చ రచ్చ
X

పాస్టర్ ప్రవీణ్‌ది హత్య అంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రంగంలోకి దిగారు. పోస్టు మార్టం జరుగుతున్న మార్చరీ వద్దకు వెళ్లారు. పోస్టుమార్టం ప్రక్రియను తాను పరిశీలిస్తానంటూ డిమాండ్ చేశారు. అయితే అందుకు పోలీసులు అనుమతించలేదు. తాను లాయర్‌గా ఇక్కడికి వచ్చాననీ.. పోస్టు మార్టం పరిశీలిస్తానన్నారు. అయినా పోలీసులు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కేఏ పాల్ రాకతో క్రైస్తవుల పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు.

అంతకు ముందు పాస్టర్ ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు కేఏ పాల్. ఆయనను చంపేసి యాక్సిడెంట్‌గా సృష్టిస్తున్నారనే అనుమానం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను రాజమండ్రి వస్తే రచ్చ రచ్చ అవుతుందని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అన్నట్లుగానే చివరకు రాజమండ్రి వచ్చారు. విచారణ సక్రమంగా జరగకపోతే సీబీఐకు కేసు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.

Tags

Next Story