YSRCP : వరుస కేసుల్లో ఎదురు దెబ్బలు.. వణికిపోతున్న వైసిపి..

వైసిపి గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అవినీతి పనులు అన్నీ ఇన్నీ కావు. చేసిన పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి ఆ పార్టీ నేతలకు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటూ జైళ్లపాలు అవుతున్నారు. ఈ కేసుల్లో ఒక్కొక్కటిగా కీలక ఆధారాలు బయటపడుతుంటే కోర్టులు సంచలన తీర్పులు ఇస్తున్నాయి. ఇప్పటికే పరకామణి కేసులో రవికుమార్ ఆస్తులపై, సతీష్ కుమార్ మృతిపై లోతుగా విచారణ సాగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో అటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కూడా కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు A2 సునీల్ యాదవ్, A7 భాస్కర్ రెడ్డి, వైయస్ ప్రకాష్ రెడ్డి, కిరణ్ యాదవ్ ల కాల్ డేటా, మెసేజ్ లను పరిశీలించాలని సునీత వేసిన పిటిషన్ పై షరతులతో విధించిన ఆదేశాలు ఇచ్చింది నాంపల్లి సిబిఐ కోర్టు. వాళ్లందరి కాల్ డేటా ఆధారంగా కీలక ఆధారాలు రాబట్టాలని కోర్టు సూచించింది. నెలరోజులలోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసుల్లో అంతిమ సూత్రధారులుగా ఉండి ఇప్పుడు బయట తిరుగుతున్న వారంతా టెన్షన్ లో పడ్డారు.
ఈ కేసు వెనకాల సూత్రధారులుగా ఉన్నవారు ప్రస్తుతం తమకేం సంబంధం లేదు అన్నట్టు బయట తిరుగుతున్న విషయాలు అందరికీ ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఇన్ని రోజులు ఈ కేసుల్లో ఇలాంటి కీలక ఆదేశాలు రాలేదు. దీంతో కేసు వెనకాల ఉన్న వైసిపి పెద్దల్లో భయం మొదలైంది. ఇప్పటికే వరుస కేసుల్లో వైసిపి నేతలు జైలుకు వెళుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లే స్వయంగా కోర్టులకు వెళ్లి ఏర్పాటు చేయించుకుంటున్న సిట్ అధికారులే వాళ్ళ అవినీతిని మొత్తం ఆధారాలతో సహా బయటపెడుతూనే ఉన్నారు. దీంతో వాటి గురించి మాట్లాడటానికి కూడా జగన్ ఇష్టపడకుండా.. జగన్ కూటమి మీద ఏదో ఒక బురదజల్లే కార్యక్రమాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ వరుస కేసులు వైసీపీ నేతలు ఎలాంటి ఇరకాటాల్లో పడేస్తాయో మనం చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

