Kinjarapu Atchannaidu : 30 అంశాల్ని సిద్ధం చేసి సభకు వెళ్తున్నాం : అచ్చెన్నాయుడు

Kinjarapu Atchannaidu : శాసన సభ, మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి.. గట్టిగా పోరాడాలని పార్టీ సభ్యులకు పిలుపు ఇచ్చారు చంద్రబాబు. ఇవాళ సమావేశాలప్రారంభానికి ముందు అధినేత నివాసంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సభా వ్యూహంపై చర్చించారు. చంద్రబాబు తాను సమావేశాలకు రావడం లేదు కాబట్టి.. నేతల సమన్వయం ఎలా ఉండాలనే దానిపై కొన్ని సూచనలు చేశారు.
చంద్రబాబుతో సమావేశం తర్వాత వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి సభకు టీడీపీ సభ్యులు సభకు వచ్చారు. మొత్తం 30 అంశాల్ని అజెండాగా చేసుకుని తాము బడ్జెట్ సమావేశాలకు వెళ్తున్నట్టు అచ్చెన్నాయుడు చెప్పారు. సభలో మాట్లాడేందుకు విపక్షానికి ఈసారైనా స్పీకర్ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ వైసీపీ సభ్యుడిగా కాకుండా హుందాగా వ్యవహరించాలని అన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సభకు రావడం మానేస్తామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com