మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ
బాధ్యత గల మంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా అని విపక్ష నేతలు మండిపడ్డారు.

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత గల మంత్రి మాట్లాడాల్సింది ఇలాగేనా అని విపక్ష నేతలు మండిపడ్డారు. సీఎం జగన్‌ ప్రోత్సాహంతోనే కొడాలి నాని మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఏపీ సీఎం, హోంమంత్రి, డీజీపీ ముగ్గురూ క్రైస్తవులైనప్పుడు... హిందూ మతం విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

అటు..నిద్ర నటిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాల్సిన అవసరం ఉందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. జగన్‌ మాటలకు, చేతలకు పొంతన లేదని తెలిపారు.

గుడివాడలో కొడాలి నాని అరాచకాలు పెరిగిపోయాయని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ విమర్శించారు. గుడివాడను నాని పేకాట డెన్‌గా మార్చారని ఆరోపించారు.


Tags

Read MoreRead Less
Next Story