మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్

మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్
పేకాడితే ఉరిశిక్ష వేస్తారా..? గట్టిగా అయితే 50-100 రూపాయలు ఫైన్ వేస్తారు అని మంత్రే అనడం విశేషం.

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో పేకాట డెన్‌లపై పోలీసుల దాడులు పెను సంచలనంగా మారాయి. ఏకంగా మంత్రి ఇలాకాలోనే విచ్చలవిడిగా కోట్ల రూపాయల్లో సాగుతున్న పందేలా వ్యవహారం.. చర్చనీయాంశమైంది. పేకాడితే తప్పేంటి అన్నట్టుగా మంత్రి నాని ఈ వ్యవహారాన్ని తేలిగ్గానే తీసుకున్నా.. విషయం CM వరకూ వెళ్లడంతో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం మంత్రి కొడాలి నానీని CM పిలిపించి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది.

పేకాడితే ఉరిశిక్ష వేస్తారా..? గట్టిగా అయితే 50-100 రూపాయలు ఫైన్ వేస్తారు అని మంత్రే అనడం విశేషం. ఈ విషయంపై టీవీ5 వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసిందా..? అని కూడా ప్రశ్నించారు. పేకాట క్లబ్‌ కేసులో తమ అనుచరులు ఉండొచ్చని అందులో తప్పేముంది అన్నారు. ఉంటే తన తమ్ముడూ ఉండొచ్చని.. ఐతే ఏమవుతుంది అని ప్రశ్నించారు. సీఎం జగన్ గట్టి చట్టాలు తీసుకొస్తున్నారని, తమ ప్రభుత్వమే ఈ పేకాట స్థావరాలపై దాడులు చేయించిందని చెప్పుకొచ్చారు.

మంత్రి కొడాలి నాని మాటలు అలా ఉంటే.. ప్రభుత్వంలోని ఓ కీలక నేత ఆదేశాలతోనే పకడ్బందీ ప్లాన్‌తో పేకాట స్థావరాలపై దాడులు జరిగాయన్న వార్తలను బట్టి ఇది YCPలో ఆధిపత్యపోరును కూడా తేటతెల్లం చేస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. అటు, ఆదివారం జరిగిన SEBI దాడుల్లో 33 మందిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ చెప్పారు.ఈ దాడుల్లో పట్టుపడిన 55 లక్షల 39 వేల రూపాయలు సీజ్ చేశారు. అలాగే 28 కార్లు, 13 బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరాలపై విచారణ కొనసాగుతోందని, ఎవరి పాత్ర ఉందనేది త్వరలోనే తేలుతుందని ఎస్పీ రవీంద్రబాబు చెప్తున్నారు.

పోలీసులు ఈ పేకాట వ్యవహారాన్ని ఛాలెంజ్‌గానే తీసుకున్నారు. ASP ఆధ్వర్యంలో ఐదుగురు DSPలు, 10 మంది CIలు సహా 100 మంది టీమ్‌తో దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అసలు ఓ పేకాట శిబిరంపై దాడికి ఇంతమంది పోలీసులు ఎందుకు అవసరమయ్యారు? అంటే ఇక్కడ ఇల్లీగల్‌గా సాగుతున్న వ్యవహారాన్ని ఛేదించాలంటే ఈ స్థాయిలో బలగాలు ఉంటే తప్ప గెడ్డం గ్యాంగ్‌కి చెక్ పెట్టలేమని భావించారా..? అందుకే పక్క జిల్లా పశ్చిమ గోదావరి పోలీసుల సాయం తీసుకుని మరీ ఎటాక్ చేసి ఈ ముఠా ఆటకట్టించారా..? ఇప్పుడిదంతా చర్చనీయాంశమైంది.

గడ్డంగ్యాంగ్ పేకాట శిబిరంపై దాడికి ప్రభుత్వంలోని కీలక నేత ఎందుకు ఆదేశాలిచ్చారు అనే దాని వెనుక జరిగిన పరిణామాలు ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇటీవల గుడివాడకు చెందిన ఒక నేత చేసిన ఒక ప్రకటనే ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహాం తెప్పించినట్టు తెలిసింది. రాష్ట్రంలో పేకాట శిబిరాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి జగన్‌, గుడివాడలో తాను ప్రముఖ పాత్ర పోషించినట్టు ఆ నాయకుడు ప్రకటన చేశారు. గుడివాడలో పేకాట వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సమయంలో ఈ తరహా ప్రకటన పార్టీ ముఖ్యులకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story