Krishna District : ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మామా.. అంటున్న కృష్ణాజిల్లా పోలీసులు
ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మామా.. అంటున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. వేడుకల్లో చిందులేయాలనే సరదా ప్రజలకేనా.. మాకు ఉండదా అంటున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. చిందులేయాలనే పోలీసుల సరదాను ఎవరూ తప్పుపట్టరు.. కానీ నిబంధనలు ప్రజలే పాటించాలి, మేము పాటించాల్సిన అవసరం లేదు అనుకోవడమే అభ్యంతరకరము అంటున్నారు సామాన్యపౌరులు.
నిబంధనలను అతిక్రమించి విజయవాడ పున్నమిఘాట్‌లో కృష్ణాజిల్లా పోలీసులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. నూతన సంవత్సర వేడుకలలో కరోనా నిబంధనలు పాటించాలి అని ఊదరకొట్టే పోలీసులే .. కరోనా నిబంధనలు బేఖాతరు చూస్తూ చిందులేశారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ చిందులేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
పోలీసులు సామాజికదూరం పాటించరా.? మాస్క్ ధరించరా.? నిబంధనలు ప్రజలకేనా.. పోలీసులకు వర్తించవా.? అనే సామాన్యుడి ప్రశ్నకు కృష్ణాజిల్లా పోలీసులు ఊ అంటారా.? ఊఊ అంటారా.?.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com