KTR: లోక్‌శ్‌ ట్వీట్‌ చూసి బాధేసింది

KTR: లోక్‌శ్‌ ట్వీట్‌ చూసి బాధేసింది
తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసు.. కేటీఆర్‌ వ్యాఖ్యలు

తెలంగాణ గల్లీ ఆత్మగౌరవానికి ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య తెలంగాణలో పోటీ జరుగుతోందని భారత రాష్ట్ర సమతి కార్యానిర్వహక అధ్యక్షుడు KTR అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్‌ ట్వీట్ బాధ కలిగించిందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. కుమారుడిగా.. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఎలా ఉంటుందో తెలుసన్నారు. KCR నిరాహారదీక్ష సమయంలో తనకు అలాంటి ఆందోళనే కలిగిందన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉండాలనే ఇక్కడ ఆందోళనలు వద్దమన్నామని మరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్‌లో తన్నులాటలు ప్రారంభం అవుతాయని జోస్యం చెప్పారు.


కర్ణాటకలో అక్రమంగా డబ్బు జమ చేస్తున్న కాంగ్రెస్‌ ఆ సొమ్ముని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తోందని KTR ఆరోపించారు. తెలంగాణకు పంపేందుకు సిద్ధంగా ఉంచిన 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయని చెప్పారు. ఇప్పటికే 8 కోట్లు కొడంగల్ చేరినట్టు సమాచారం అందిందన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని, అలాంటి పార్టీ 70 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతోందని KTRప్రశ్నించారు. డబ్బులు ఇచ్చిన వారికే హస్తం పార్టీలో టిక్కెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. KCR 100 స్థానాల్లో ప్రచారం చేస్తారని... తాను కొన్ని స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్‌లో సీఎం పదవిపై ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్టు సమాచారముందని తెలిపారు. రాహుల్‌గాంధీ లీడర్ కాదు రీడర్ అని KTR విమర్శించారు. అమిత్ షా అబద్ధాలకు హద్దే లేదని తమపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని.. డిమాండ్‌ చేశారు. భారతీయ జనతా పార్టీకి ఈసారి కూడా 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతవుతాయన్నారు. రేవంత్ అక్రమాలపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయటం లేదని KTR ప్రశ్నించారు. హుజురాబాద్‌లో తామే గెలుస్తున్నామని ఈటల మరో 50 చోట్ల పోటీ చేసినా షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. త్వరలో చాలా మంది ప్రముఖులు భారాసలో చేరతారని KTR తెలిపారు. KCR ఈసారి కూడా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ECస్వతంత్రంగా పని చేస్తుందని భావిస్తున్నామని KTR చెప్పారు. అధికారుల బదిలీలను సాధారణంగానే చూస్తున్నామన్నారు. సిరిసిల్లలో ఓటర్లకు తాను డబ్బు మద్యం పంపిణీ చేయనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story