KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలిచిన ఎంపీ సీట్లపై బీఆర్‌ఎస్ కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీల పవర్ ఏంటో తెలిసిందా అని తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు పదహారు సీట్లు వస్తే ఏం చేసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఇప్పుడు ఏపీలో టీడీపీకి 16ఎంపీ సీట్లు వచ్చాయని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆ పార్టీ అడ్డుకోగలిగిందని అన్నారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, సింగరేణిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ రక్షణ కవచమని... కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 16 ఎంపీ సీట్లు ఇవ్వాలని కేసీఆర్ చాలాసార్లు విజ్ఞప్తి చేశారని... 16 ఎంపీలతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది చాలా మాట్లాడారన్నారు. ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణయాత్మక పాత్రలో ఉందని గుర్తు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని... తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణిని ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎనిమిది స్థానాలు గెలిచిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించడం లేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి బొగ్గు గనుల యాక్షన్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. 16ఎంపీల పవర్ ఏంటో ఏపీని చూస్తే తెలుస్తుందని ఉద్ఘాటించారు. రేవంత్ ఎందుకు ఆపడం లేదు. కేసుల భయమా? అని ఎద్దేవా చేశారు. సింగరేణి మెడ మీద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్ ఆ కత్తికి సాన పడుతున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. బొగ్గు గనులు వేలం పాడితే కూడా తెలంగాణ నష్టపోతుంది. రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఖతం చేసినట్టే తెలంగాణ బొగ్గు గనులు కూడా అదే రీతిలో కాబోతుంది. కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు బొగ్గు గనులు అగమయ్యే పరిస్థితికి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని డిమాండ్ చేస్తున్నా.. ఈ ప్రయత్నాన్ని ఆపండి. కేసులకు భయపడి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
సింగరేణిని కార్పొరేట్ గద్దలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటామన్నారు. వేలంలో పాల్గొనే వారు ఆలోచించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిస్సా, గుజరాత్‌లో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చి ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనాలని నిలదీశారు. ఇక్కడ ఉన్న ఎంపీలు చేత కానివారా అని కేటీఆర్ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com