AP : విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నా: లక్ష్మీనారాయణ

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. విశాఖ ఉత్తరం సీటు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక స్వపరిపాలన పోయిందని విమర్శించారు. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని అన్నారు.
అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని డబ్బులు ఇచ్చి కొనడాన్ని వ్యాపారంగా భావిస్తున్నారు. కాబట్టి, ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా ఉండే పార్టీకు ఓటును వేయాలని, అవినీతి రహిత ప్రభుత్వం, నిరుద్యోగ రహిత ప్రభుత్వం కావాలంటే ఏ.పీ. యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలను గెలిపించవలసిందిగా కోరారు. కాగా లక్ష్మీనారాయణ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తు ను కేటాయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com