Proddatur : ప్రొద్దుటూరులో ప్రభుత్వ భూమి కబ్జా.. వైసీపీ నేతపై ఆరోపణలు

Proddatur : ప్రొద్దుటూరులో ప్రభుత్వ భూమి కబ్జా.. వైసీపీ నేతపై ఆరోపణలు
X

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరులో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వైసీపీ సర్పంచ్ వల్లూరు శివలక్ష్మి భర్త నాగేంద్ర రెడ్డిపై భూకబ్జా ఆరోపణలున్నాయి. లక్షల రూపాయల విలువ చేసే భూములను నాగేంద్ర రెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్‌కు పాల్పడి వాటిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గోర్ల చిన్న ఓబయ్య యాదవ్‌ అనుభవంలో ఉన్న 4ఎకరాల 83 సెంట్ల భూమిని కబ్జా చేసి 2021లో విలాసవంతమైన భవనాన్ని నిర్మించాడు. ప్రభుత్వానికి సచివాలయం, ఆర్‌.బీ.కె కేంద్రం, జగనన్న కాలనీకి తన కుటుంబ సభ్యుల పేరుపై ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి దానం చేశాడు.

కబ్జాకు గురైన భూమి పత్రాలతో అప్పటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని బాధితుడు కలిసి నాగేంద్ర రెడ్డిపై ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వంలో అధికారాన్ని ఉపయోగించి బాధితుడి ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా నాగేంద్ర బెదిరింపులకు దిగాడు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ హయాంలోనైనా తనకు న్యాయం చేయాలని బాధితుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరుకుంటున్నారు.

Tags

Next Story