Anna Canteens : పంద్రాగస్టున భారీ స్థాయిలో అన్న క్యాంటీన్ల ప్రారంభం
ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. "33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే బృందంతో సమన్వయం చేసుకోవాలి" అని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రైన్లలో పూడిక తొలగింపుపై సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. డ్రైన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com