ఏపీ ప్రభుత్వం ఐపీ పెట్టింది: నారా లోకేశ్

జగన్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం జగన్ సర్కార్ పీకల్లోతు అప్పుల్లో ఉందని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐపీ పెట్టిందని చెప్పారు. మంత్రుల సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఇటీవల తెచ్చిన 10 వేల కోట్ల అప్పు జీతాలు, వడ్డీలకే సరిపోయిందన్నారు. జగన్ పాలనలో సామాన్యులు బ్రతకడం కష్టంగా మారిందని.. అందుకే చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారని చెప్పారు.
మరోవైపు యువగళం పాదయాత్ర 134వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 17వందల 20 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 4గంటలకు వెంకటగిరి శివారు కమ్మపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రలో భాగంగా కమ్మపాలెంలో ఎస్టీలతో, వెల్లంపాలెంలో పద్మశాలిలతో సమావేశం అవుతారు లోకేష్. ఇక వెల్లంపాలెంలోని పోలేరమ్మ గుడివద్ద స్థానికులతో సమావేశం అయి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం పాతబస్టాండులోబహిరంగసభ పాల్గొంటారు.
ఇక బహిరంగ సభ అనంతరం త్రిభువన్ సెంటర్, ఆర్టీసి బస్టాండ్, వెంకటగిరి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం పాలకేంద్రం వద్దకు చేరుకుని అక్కడ ఎస్టీ సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు. ఇక రాపూరు క్రాస్, నిడిగల్లు క్రాస్‌తో పాటు బంగారుపేటలో స్థానికులతో సమావేశం భేటీ అవుతారు. అనంతరం పాదయాత్రగా వెళ్తూ జంగాలపల్లి, సిద్ధగుంట, నిడిగల్లులో స్థానికులతో భేటీ అయి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆ తరువా నేరుగా నిడిగల్లు శివారు విడిది కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడితో లోకేష్ 134వ రోజు పాదయాత్ర ముగుస్తోంది. ఇక రాత్రికి అక్కడే లోకేష్ బస చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com