LOKESH: వైసీపీ కార్యకర్తకు నారా లోకేశ్ అండ

మంత్రి నారా లోకేష్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి మంచి మనసును చాటుకున్నారు. ఒక వైఎస్సార్సీపీ కార్యకర్త సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం ట్వీట్ చేయగా, లోకేష్ వెంటనే స్పందించి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్‌ను ప్రశంసించారు. 'నారా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్.. సీఎంఆర్ఎఫ్ విషయంలో మీ సపోర్ట్ కావాలి. మా దగ్గర అవసరమైన అన్ని మెడికల్ బిల్లులు ఉన్నాయి.. వాటిని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మాకు సాయాన్ని సమాయానికి చేయండి.' అంటూ ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. 'మీరు నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు.. నా టీమ్ వెంటనే ఈ అంశాన్ని పరిశీలిస్తుంది అవసరమైన వివరాలు అందించండి' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ఏపీకి మరో వందే భారత్ రైలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రానుంది. చెన్నై-నరసాపురం వందే భారత్‌కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. త్వరలోనే నరసాపురం నుంచి చెన్నైకి వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభినందించారు. వందే భారత్ రైలు రాకపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూపతిరాజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com