Oman : ఒమన్ లో చిక్కుకున్న మహిళ.. స్వదేశానికి రప్పించేలా లోకేశ్ చర్యలు

Oman : ఒమన్ లో చిక్కుకున్న మహిళ.. స్వదేశానికి రప్పించేలా లోకేశ్ చర్యలు
X

యువనేత, ఏపీ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఒమన్ లో చిక్కుకున్న మామిడి దుర్గ అనే మహిళ "లోకేష్ అన్న.. నన్ను కాపాడండి" అంటూ ఒక వీడియోను విడుదల చేయడంపై స్పందించారు. ఇటీవలే కువైట్ ఎడారిలో గొర్రెల కాపరి పనిలో నరకం అనుభవిస్తున్న శివ అనే వ్యక్తిని ఏపీకి రప్పించిన సంగతి తెలిసిందే.

నాలుగు నెలల క్రితం ఏజెంట్ల ద్వారా ఒమన్ చిక్కుకుపోయానని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని లేవలేని పరిస్థితిలో ఉన్నానని తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చింది. ఆ మహిళ చేసిన ట్వీట్ పై మంత్రి తక్షణమే స్పందించారు. ఒమన్ లో చిక్కుకున్న మామిడి దుర్గాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ భరోసానిచ్చారు.

గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె వీడియోకు లోకేష్ రీ ట్వీట్ చేశారు. స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్నారై టీడీపీకి మామిడి దుర్గను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంతో మాట్లాడి వెంటనే ఆమెను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు.

Tags

Next Story