చేనేత కార్మికులతో లోకేష్ ముఖాముఖీ

ఎన్నికల ముందు చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను రద్దు చేశారని అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో లోకేష్ ముఖాముఖీ సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 60 మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికులను దత్తత తీసుకుంటామని చెప్పారు.
జగన్ ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు లోకేష్. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఐపీ పెట్టిందన్నారు. మంత్రుల సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఇటీవల తెచ్చిన 10 వేల కోట్ల అప్పు.. జీతాలు, వడ్డీలకే సరిపోయిందన్నారు. జగన్ పాలనలో సామాన్యులు బ్రతకడం కష్టంగా మారిందని అందుకే చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో మ్యానిఫెస్టో ప్రకటించారని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తిరిగి ప్రారంభించి సబ్సిడీ కింద పనిముట్లు అందజేస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com